గలగలా మాట్లాడుతూ క్యూట్ గా హాట్ గా మెప్పించింది జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. జెనీలియా తన పేరుతో తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నమోదు చేసుకుంది. తెలుగులో జెనీలియా బొమ్మరిల్లు, సై, రెడీ,ఢీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా జెనీలియా నటనని ఎప్పటికి మరిచిపోలేం. వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ ఇప్పటికి జెనీలియా కుర్ర భామలాగే ఉంటుంది. 2012లో జెనీలియా నటుడు రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు సంతానం. తాజాగా జెనీలియా అద్భుతమైన చీరలో మెరుపులు మెరిపిస్తూ ఫోజులు ఇస్తోంది. చీరకట్టులో నిండుదనంతో జెనీలియా సొగసు రెట్టింపు అయింది. చిరునవ్వులు చిందిస్తూ నిండు జాబిలిలా ఈ సీనియర్ బ్యూటీ వెలిగిపోతోంది. మల్లెపూలు జెనీలియా అందాన్ని మరింత పెంచుతున్నాయి.
Beautiful #geneliadsouza pic.twitter.com/blcY6HCmeL
— Filmy Glamour (@FilmyGlamour) April 29, 2023