శ్రీవాస్ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'రామ బాణం' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. ఈ చిత్రం మే 5, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్స్‌లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.