యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన తదుపరి చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, టాలీవుడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'IB71' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ గూఢచర్య థ్రిల్లర్ మే 12, 2023న విడుదల కానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా 119 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉంది అని సమాచారం.
ఈ దేశభక్తి స్పై థ్రిల్లర్‌లో అనుపమ్ ఖేర్, విశాల్ జెత్వా, అశ్వత్ భట్, దలీప్ తాహిల్, డానీ సురా, సువ్రత్ జోషి మరియు దివాకర్ ధ్యాని తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. విద్యుత్ జమ్‌వాల్, అబ్బాస్ సయ్యద్, భూషణ్ కుమార్ మరియు క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |