పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతలో సలార్ సినిమా విడుదల వాయిదా పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో సినిమా కూడా వాయిదా పడుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ ని కొట్టిపారేసిన చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 28న సాలార్ విడుదలవుతుందని అన్నారు. 'ఆదిపురుష' సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.
![]() |
![]() |