ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'రావణాసుర' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 08:51 PM

యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో OTT ఎంట్రీ ఇచ్చింది. తాజాగా, రావణాసుర హిందీ వెర్షన్ OTT ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.

అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో హీరో సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ అండ్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com