సంతోష్ శోభన్ హీరోగా, మాళవికా నాయర్ హీరోయిన్‌గా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా అన్నీ మంచి శకునములే. రెండు కుటుంబాల మధ్య కోర్టు గొడవలు, హీరోహీరోయిన్ ప్రేమించుకోవడం అలా సాగుతుందీ కథ. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అందువల్ల ప్రేక్షకులు కొత్తదనం ఆస్వాదించలేరు. సంతోష్, మాళవిక నటన, పాటలు, పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే కథనం బోర్ తెప్పిస్తాయి.