టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమా కొన్ని నెలల క్రితం స్టైల్‌గా లాంచ్ అయ్యింది. లవ్ స్టోరీ ట్రాక్ లో రానున్న బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన జోడిగా యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య నటిస్తుంది.
సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది అని దర్శకుడు తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీషా, కుసుమ డేగలమర్రి, సాథ్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.