శ్రీకాంత్ జి రెడ్డి రచన మరియు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తెలుగు కామెడీ చిత్రానికి 'మెన్ టూ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్‌లైన్‌లో అధికారిక ప్రకటన చేశారు.
హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ, మౌర్య సిద్దవరం, కౌశిక్ ఘంటసాల, ఆశ్రిత, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లాంతర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మౌర్య సిద్దవరం నిర్మించిన ఈ చిత్రానికి ఎలిషా ప్రవీణ్ సంగీతం అందిస్తుండగా, ఓషో వెంకట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నారు.