బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ,అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం గల్లీ బాయ్. జోయా అక్తర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. ఈ సినిమాలో హద్దు మీరిన సన్నివేశాలు ఉన్నాయని , పైగా ఇందులో బూతు డైలాగు లు ఎక్కువ ఉండడం తో వాటికి సెన్సార్ కట్స్ చేసినట్టు తెలుస్తుంది.
దాదాపు 13సెకన్ల పాటు ఉన్న సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం. ఈ చిత్రానికి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒకవేళ ఆ సన్నివేశాల్నితీయకపోతే `ఎ` సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేదని చెబుతున్నారు. ఇంకా సినిమాలో వచ్చే బూతు పదాల మీద బీప్ చేయాలని లేదా వేరే పదాలతో రీప్లేస్ చేయాలని వారు కోరారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa