ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా కొత్త సినిమా గురించి కొన్ని విషయాలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 05:22 PM

రానా  కొత్తదనం వున్న కథలకి మాత్రమే రానా ప్రాధాన్యతనిస్తున్నాడు .. కొత్తదనం కలిగిన కాన్సెప్టులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా ఆయన అంగీకరించిన తమిళ .. హిందీ సినిమాలు సెట్స్ పై వున్నాయి. ఆ  సినిమాల షూటింగులతో ఆయన బిజీగా వున్నాడు. త్వరలోనే ఆయన ఒక తెలుగు సినిమా చేయనున్నాడు.

మిళింద్ రావ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి 'గృహం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీనాథ్ ఆచంట ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా, రానాకి హిట్ ఇస్తుందేమో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa