అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో యంగ్ హీరో అశ్విన్ బాబు నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హిడింభ' జులై 20, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 17వ రోజు 2.05 లక్షల రేంజ్ లో షేర్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.
ఈ సినిమా అశ్విన్ సరసన జోడిగా నందితా శ్వేత నటిస్తుంది. సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.