అతిలోక సుందరి శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కింది.ఈ లోకం నుంచి వెళ్లిపోయినా సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీదేవి బొమ్మను..గూగుల్ ఇవాళ డూడుల్ గా పబ్లిష్ చేసింది.శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఆమెను గూగుల్ ఈవిధంగా గౌరవించింది.
“దేవత” సినిమాలోని “ఎల్లువచ్చే గోదారమ్మ” పాటలోని ఒక సీన్ ను ఇప్పుడు మనం గూగుల్ హోమ్ పేజీలోని డూడుల్ ప్లేస్ లో చూడొచ్చు..ముంబైకి చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ భూమికా ముఖర్జీతో గూగుల్ ఈ డూడుల్ ఇలస్ట్రేషన్ ను(Google Doodle-Sridevi) గీయించింది.తమిళనాడులో పుట్టిన శ్రీదేవి అసలు శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్. మూవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు శ్రీదేవి అయ్యింది. టీనేజ్‌లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రికార్డు శ్రీదేవి సొంతం. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ని శ్రీదేవి పెళ్లి చేసుకుంది. ఈమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. 2018లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు.