చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా నిర్మితమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు ఇంకా చాలా సమయం ఉండటంతో అభిమానులు కాస్తంత నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.
అయితే ఈ సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చేసినట్టుగా తెలుస్తోంది. మార్చి మొదటివారంలో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాంతో షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. ఆ తరువాత పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలుంటాయి గనుక, ఆగస్టుకు రావడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa