త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. వచ్చేనెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంపిక చేసుకున్నాడు.
'అరవింద సమేత'కి తమన్ అందించిన సంగీతం, ఆ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. అందువలన త్రివిక్రమ్ మళ్లీ తమన్ కి అవకాశం ఇచ్చాడు. బన్నీకి ఏ తరహా ట్యూన్స్ కావాలో .. ఆయన నుంచి ఎలాంటి బాణీలను అభిమానులు ఆశిస్తారో తమన్ కి బాగా తెలుసు. అందువల్లనే తమన్ ఆ తరహా ట్యూన్స్ కోసం కసరత్తు మొదలు పెట్టాడట. గతంలో బన్నీ .. తమన్ కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' .. 'సరైనోడు' పాటల పరంగా మంచి మార్కులు సాధించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa