సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి వచ్చి అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆగస్టు 25, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.