ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఘవేంద్రరావు కుమారుడి సినిమాలో షారుక్ ఖాన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 12:41 PM

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగానే సినీ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత సినిమాలకి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ప్రకాష్ ‘మెంటల్ హై క్యా’ అనే ఓ హిందీ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.


కాగా ‘మెంటల్ హై క్యా’లో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.


ఇక ఈ ‘మెంటల్ హై క్యా’ చిత్రాన్ని మార్చి 29వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ప్రకాష్ గత చిత్రం ‘సైజ్ జీరో’ కూడా బాగానే ఆడింది. మరి ఇప్పుడు రాబోతున్న ఈ హిందీ చిత్రం కూడా హిట్ అవుతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa