ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాప్ హీరోయిన్స్ ఇద్దరి మధ్య గట్టి పోటీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 12:21 PM

తెలుగు .. తమిళ భాషల్లో నయనతార .. సమంతలకు విపరీతమైన క్రేజ్ వుంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేవారే. అలాంటి ఈ ఇద్దరి సినిమాలు ఇంచుమించు ఒకేసారి రంగంలోకి దిగనున్నాయి .. గట్టిపోటీని ఇవ్వనున్నాయి. నయనతార ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'ఐరా' సినిమా ఈ నెల 28వ తేదీన తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ హారర్ మూవీలో నయనతార ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక సమంత .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన 'సూపర్ డీలక్స్' మార్చి 29వ తేదీన థియేటర్లకు రానుంది. రమ్యకృష్ణ పోషించిన కీలకమైన పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఒకరోజు తేడాతో మాత్రమే రెండు సినిమాలు విడుదలవుతున్న కారణంగా, రెండింటి మధ్య గట్టిపోటీ ఏర్పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఇదే తేదీల్లో ఈ సినిమాలను తెలుగులోను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఎవరి సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa