ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యాత్ర' మూవీ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 12:11 PM

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యం మాత్రమే తీసుకుని దర్శకుడు మహి.వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించాడు. ఇటీవలే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వైఎస్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 కోట్ల జినెస్ చేసింది. ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 6.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 8.81కోట్ల షేర్ ను సాధించింది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకి మంచి లాభాలే వచ్చినట్టుగా సమాచారం. బయ్యర్ల విషయానికి వస్తే వాళ్లకి స్వల్ప నష్టాలు తప్పలేదని చెప్పుకుంటున్నారు. దర్శకుడు పక్కాగా ప్లాన్ చేసుకుని, పరిమితమైన బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించడమే పెద్దగా ఇబ్బంది లేకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa