దర్శకుడు శ్రీను వైట్ల తన ఫామ్‌హౌస్‌లోకి మొదటిసారిగా తెచ్చిన ఆవు మరణించింది. ఈ సందర్భంగా ..... '13 ఏళ్లగా మా ఫామ్‌లో ఉంటున్న ఆవు మరణించడంతో కుటుంబ సభ్యుల హృదయాలు శోకసముద్రంలో నిండిపోయాయి’ అంటూ ట్వీట్ చేశారు. ‘నా ఫామ్‌లోకి మొదటిగా తెచ్చుకున్న ఆవు మరణించింది. 13 ఏళ్లగా తనని మేమంతా కుటుంబ సభ్యురాలిగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. నా కూతుళ్లు ఇద్దరిను ఎంతో ప్రేమతో మా ఆవుని లక్ష్మీ అని పిలుస్తారు. మా లక్ష్మీకి సాంప్రదాయంగా అంత్యక్రియలు చేసి వీడ్కోలు చెబుతాం’’ అని శ్రీనువైట్ల లక్ష్మీ ఫొటోను షేర్ చేశారు.