మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క శెట్టి మరియు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటు సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు $1.3 మిలియన్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇండస్ట్రీ ట్రాకర్ USAలో బుధవారం నాడు 262 స్థానాల నుండి $46,902 వసూలు చేసింది మరియు ఇప్పటివరకు $1.3 మిలియన్లను కలెక్ట్ చేసినట్లు ట్వీట్ చేసారు.
మురళీ శర్మ, జయసుధ, తులసి తదితరులు ఈ రోమ్-కామ్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa