టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్లతో తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'విశ్వం' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి గోపీచంద్ ఎంత పారితోషికం తీసుకున్నారనే దానిపై ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. ఈ సినిమా కోసం మాకో హీరోకి 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. శ్రీనువైట్ల పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో అనుబంధం ఉన్న గోపీ మోహన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరా క్రాంక్ చేయగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొన్పూడి విశ్వం చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa