సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. భారీ పోటీ మధ్య ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ 120 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa