కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'లియో’ ఈ నెల 19న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. తమిళనాడులోని రోహిణి థియేటర్లో గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను రోహిణి థియేటర్లో ప్రదర్శించారు. అయితే ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడం అసహనానికి గురైన అభిమానులు ఆ థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల నిరాశకు గురైన అభిమానులు థియేటర్లో విధ్వంసం సృష్టించారని కొందరు అంటుంటే, థియేటర్ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులు ఆగ్రహానికి గురయ్యారని చెబుతున్నారు. కొందరు ఈ తప్పు ఎవరిది? థియేటర్ యాజమాన్యానిదా? అభిమానులదా? థియేటర్లో సృష్టించిన విధ్వంసానికి, జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.