అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ ఇలాంటి కాలేజీ నేపథ్యంలో 'మ్యాడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాతో కొంతమంది కొత్త టాలెంట్ ని పరిచయం చేశారు, అలాగే దర్శకుడు కళ్యాణ్ శంకర్ కూడా ఈ సినిమాతో ఆరంగేట్రం చేసాడు. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ఈ సినిమా కథ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్) ఈ ముగ్గురూ మూడు ప్రాంతాలకు చెందిన వారు, ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ వుంటారు. భగవాన్ కాంటీన్ విషయంలో వేరే కాలేజీ వాళ్ళతో బాస్కెట్ బాల్ ఆది గెలుపొందే సమయంలో వీళ్ళు ముగ్గురూ మంచి స్నేహితులయిపోతారు. మనోజ్, శృతి (గౌరీ) అనే అమ్మాయిని, ప్రేమిస్తే, జెన్నీ (అనంతిక) అనే అమ్మాయి అశోక్ ని ఇష్టపడుతుంది. దామోదర్ అలియాస్ డీడీ కి గుర్తు తెలియని అమ్మాయి వెన్నెల పేరుతో ఒక ప్రేమ లేఖ రాసి, రోజూ ఫోనులో మాట్లాడుతూ ఉంటుంది. అయితే వెన్నెల ఎవరో తెలియకుండానే, చూడకుండానే ఫోనులో మాట్లాడేస్తూ ఉంటాడు డీడీ. అలాగే నాలుగేళ్ళు గడిపేసి కాలేజీ విడిచిపెట్టే సమయంలో వెన్నెల ఎవరో తెలుసుకోవాలని నన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంతకీ వెన్నెల ఎవరు, మధ్యలో లడ్డు (విష్ణు) కథ ఏంటి, అతను ఎక్కడ నుంచి వచ్చాడు, అతను నేపధ్యం ఏంటి, ఈ ముగ్గురు స్నేహితులు చివరకు ఏమి చేశారు, ఇవన్నీ తెలియాలంటే 'మ్యాడ్' సినిమా చూడాల్సిందే.