శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ‘మంత్ ఆఫ్ మధు’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో స్వాతి మాట్లాడుతూ... ‘‘ఓ జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. అది అందరికీ నచ్చింది. ఈ సినిమాలో చేసిన లేఖ పాత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటా’’ అన్నారు. ‘‘తమిళ, మలయాళ భాషల్లో కొత్త తరహా సినిమాలొస్తున్నాయి. తెలుగులో రావడం లేదన్న ప్రశ్నకి ‘మంత్ ఆఫ్ మధు’ ఓ సమాధానం. ఈ సినిమాకి మంచి రివ్యూలు రావడం ఆనందంగా ఉంద’’న్నారు నవీన్ చంద్ర. ‘‘ఓవర్సీ్సలో కూడా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాని మరింత మందికి చేరువ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామ’’ని నిర్మాత యశ్వంత్ తెలిపారు.