ఒక ఆసక్తికరమైన హారర్ జానర్ చిత్రంతో శ్రీ పద్మిని సినిమాస్ అనే బ్యానర్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. పోస్టర్లో పాత్రలు కనిపించనప్పటికీ ఈ చిత్రం ప్రీలుక్ ఇటీవల పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు ‘రా..రాజా’ అనే టైటిల్‌తో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో కూడా హీరోహీరోయిన్ ఎవరో తెలియనీయకుండా చేశారు. ఆకట్టుకునే కథనం మరియు స్క్రీన్‌ప్లేతో స్క్రిప్ట్‌లో చాలా మలుపులు ఉన్నందున కాస్టింగ్ సమాచారాన్ని సస్పెన్స్‌లో ఉంచడానికి మొత్తం చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బి.ఎస్ ప్రసాద్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నారు. అతి త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే థియేట్రికల్ ట్రైలర్ కంటే ముందే.. ఈ సినిమాలో ఉన్న ఆకర్షణీయమైన అంశాలను తెలియజేస్తామని దర్శకనిర్మాత బి.ఎస్ ప్రసాద్ చెబుతున్నారు.