స్టార్ హీరోయిన్ సమంత తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య పేరుతో ఉన్న టాటూ తొలగించిందా? అనే విషయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సమంత ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఫొటోల్లో చైతన్య టాటూను తొలగించినట్లు కనిపిస్తోంది. ఆమె నిజంగానే ‘చై’ టాటూను తొలగించారా? లేక మేకప్ వల్ల టాటూ కనిపించడం లేదా? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.