యంగ్ బ్యూటీ నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ తో నెటిజన్లపై అందాల మత్తు జల్లుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసి చూపుతిప్పుకోకుండా చేసింది. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడే అవకాశాలు అందుకుంటూ వస్తోంది. ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. కన్నడ చిత్రం ‘ముంగరు మేల్ 2’తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘మెహబూబా’ చిత్రంతో పూరీ జగన్నాథ్ ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత నేహా పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ మెరుపులతో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అట్రాక్టివ్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఊరించే పెదాలు, మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధులను చేసింది. అదిరిపోయే స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక నేహా నెక్ట్స్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటిస్తోంది.
Adorable #Nehashetty pic.twitter.com/TZQ5mqWMYZ
— VD bulletin (@vdbulletin) October 13, 2023