కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య నటించిన తాజా చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ . దీపావళికి విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లారెన్స్ మాట్లాడుతూ... ‘‘తెలుగులో ఓ చిత్రం చేస్తుండటంతో ‘జిగర్తాండ’ తొలి భాగంలో నటించలేకపోయా. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. టీవీలో వచ్చినపుడల్లా ఈర్ష్య చెందేవాడిని. మంచి చిత్రంలో నటించలేకపోయాననే బాధ ఉండేది. ఇపుడు రెండో భాగంలో నటించే అవకాశం లభించింది. ఇక అభిమానులు విలువైన సమయాన్ని వారి కుటుంబ సభ్యుల కోసం వెచ్చించాలన్నదే నా అభిమతం. నా చిత్రం విజయవంతం కావాలని వారివారి ఇళ్లలోనే ఐదు నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. వారు ఆదరించడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా. నాతో ఫొటో దిగాలని భావిస్తే, వారి ఇళ్లకే వెళ్తా’’ అని లారెన్స్ వెల్లడించారు.