సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార శుక్రవారం తన ఇన్ స్టా గ్రామ్ లో తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసింది. ‘‘సినిమా అనే పదానికి నా జీవితంలో, నా ఎదుగుదలలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది నాకు కేవలం పరిశ్రమ కాదు. నా డీఎన్ఏ లోనే భాగం. మా తాతగారు ప్రపంచానికి లెజెండరీగా, సూపర్ స్టార్ కృష్ణగా సుపరిచయం. మా అందరిపై ఎంతో ప్రభావం చూపించిన వ్యక్తి. ఆయన నా తండ్రి, నా సోదరుడు, నాకు ఇచ్చి వెళ్లిన వారసత్వంలో భాగమైనందుకు నేను ఎంతో గర్వపడతున్నాను’’అని సితార ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.