‘పఠాన్’, ‘జవాన్’ వంటి రెండు వరుస హిట్స్‌తో మంచి క్రెజ్ లో ఉన్న షారుఖ్.. అయన తదుపరి చిత్రం ‘డంకీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నారు. ‘డంకీ’ సినిమా డిసెంబర్ 22న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. కానీ, అనూహ్యంగా ఇదే డేట్‌కి ‘సలార్’ కూడా యాడ్ అవడంతో.. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకుడు. ‘కెజియఫ్’తో బాక్సాఫీస్‌ని అల్లాడించిన ప్రశాంత్ నీల్, గ్లోబల్ రేంజ్ స్టార్‌గా మారిన ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు రాజ్‌కుమార్ హిరాణీ సినిమాలకు ఉండే అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఆయన నుంచి సినిమా వస్తుందీ అంటే.. ఆ సినిమాకు ఓ రేంజ్ ఉంటుంది. సో.. రెండూ నువ్వా? నేనా? అనేలాంటి సినిమాలే. అందుకే.. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల విడుదలపై హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.