బైక్ ప్రమాదం జరిగిన తరువాత విడుదలైన 'విరూపాక్ష' , తరువాత 'బ్రో' రెండు సినిమాలు సాయి ధరమ్ తేజ్ కి మంచి విజయాలు అందించటంతో అతని కెరీర్ గ్రాఫ్ ని పైకి తీసుకెళ్లాయి అనే చెప్పాలి. అక్టోబర్ 15 సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు . అందుకని సంపత్ నందితో చెయ్యబోయే సినిమా నుండి మొదటి లుక్, సినిమా టైటిల్ కూడా విడుదల చేసే అవకాశం వుంది. ఈరోజు ఆ సినిమా గురించి వచ్చిన ప్రకటనలో సాయి ధరమ్ తేజ్ ఫుల్ మాస్ గా ఇందులో ఉంటాడని, ఇది ఒక పూర్తి వ్యాపారాత్మక చిత్రం అని అర్థం అయిపోతోంది. ఈ సినిమాని సితార ఎంటర్ టైనమెంట్ నిర్మిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య కూడా ఒక నిర్మాత. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన పూజ హెగ్డే కథానాయకురాలిగా నటించనుంది.