కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8, 2023న థియేటర్లలోకి రానుంది అని చిత్ర బృందం మొదట్లో ప్రకటించింది. తాజాగా ఇప్పుడు ఈ గ్రామీణ పల్లెటూరి డ్రామా కొత్త విడుదల తేదీకి రీషెడ్యూల్ చేయబడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 29, 2023న థియేటర్లలోకి రానుందని సమాచారం.
ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.