ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అకీరా సినీప్రవేశంపై రేణు దేశాయ్ వ్యాఖ్యలు వైరల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 11:10 AM

రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలలో రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్  గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అకీరా నందన్ ఎంట్రీ గురించి రేణు మాట్లాడిన తీరు చూస్తే.. ఇప్పుడప్పుడే అకీరా ఎంట్రీ ఉండకపోవచ్చని, అసలు అకీరా హీరోగా చేయడు అనేలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు రేణు దేశాయ్ ఏమందంటే.. ‘‘హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి  ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. కొడుకుని బిగ్ స్క్రీన్‌పై చూడాలని ప్రతి తల్లికి వుంటుంది. నాకు కూడా వుంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది..’’ అని చెప్పుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com