'లియో’ సినిమా సక్సెస్ అయిన ఆనందంలో విజయ్ అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు. చెన్నైలోని ఓ థియేటర్లో విజయ్ను అభిమానించే ఓ జంట దండలు మార్చుకోవడం వైరల్గా మారింది. చెన్నైకు చెందిన వెంకటేష్, మంజుష అనే జంట అక్టోబర్ 20న పెళ్లిచేసుకోనున్నారు. వాళ్లిద్దరూ ‘లియో’ థియేటర్లో ప్రేక్షకుల ఎదుట ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకున్నారు. దీని కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తునట్లు తెలిపారు.