ఇటీవల వైరల్ ఫీవర్తో బాధపడ్డ నటి శ్రుతి హసన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. మొదట తనకు డెంగ్యూ వచ్చిందని అనుకున్నానని.. అయితే అది వైరల్ ఫీవర్ అని తెలిసి లైట్ తీసుకుంటే పూర్తిగా వీక్ అయ్యానని.. ప్రస్తుతానికి కోలుకున్నానని తెలిపింది. ఈ సందర్భంగా తనకు చికిత్స చేసిన వైద్యులకు, సిబ్బందికి ఆమె ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా శ్రుతి అభిమానులు అక్టోబర్ 26న చెప్పే సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నారు.