మహత్ రాఘవేంద్ర , మీనాక్షి గోవిందరాజ్ హీరోహీరోయిన్లుగా ‘కాదలే కాదలే’ పేరుతో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీవారి ఫిలిమ్స్ బ్యానరుపై నిర్మాత పి.రంగనాథన్ నిర్మిస్తుండగా ఆర్. ప్రేమ్‌నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యమైన శక్తి. యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు జీవితంలో ఇది ఒక భాగం. ఏది ఏమైనప్పటికీ ప్రేమలో ఉండటం, ఒకే భాగస్వామితో బలమైన వైవాహిక సంబంధంతో కొనసాగడం అనేది కాలక్రమేణా మారిపోయింది. సమకాలీన సంబంధాలలో పెను మార్పు వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని నేటితరం యువతీ యువకుల ప్రేమ, సంబంధ బాంధవ్యాలపై వారి దృక్పథాన్ని తెలిపేలా ఉంటుంది. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నాం. ఆ పాత్రకు మహత్ రాఘవేంద్ర అయితే, సరిగ్గా సరిపోతారని ఆయనను ఎంపిక చేశాం. హీరోయిన్ మీనాక్షి విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఎంపిక చేశాం. ఇందులో సీనియర్ దర్శకులు భారతీరాజా, కేఎస్ రవికుమార్, వీటీవీ గణేష్, రవీనా రవి తదితరులు నటిస్తున్నారు. ‘సీతారామం’ వంటి మ్యూజికల్ హిట్ తర్వాత విశాల్ చంద్రశేఖర్ మరోమారు రొమాంటిక్ బాణీలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని వివరించారు.