కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్' సినిమా అక్టోబర్ 6, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 8.49 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యన్ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో ఈ యూత్‌ఫుల్ మూవీని హారిక సూర్యదేవర నిర్మించారు.