టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. జులాయి, S/o సత్యమూర్తి మరియు అలా వైకుంఠపురములో తర్వాత వీరిద్దరూ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ త్రిష జోడిగా నటిస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లు నిర్మించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa