సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
ఈ సినిమాలో గంగా జాతర సీక్వెన్స్ ని ఒక రేంజ్ లో షూట్ చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ షూట్ కి 40-50 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. షూట్ స్టార్ట్ అయ్యే సమయానికి 200 కోట్లతో సినిమా చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పటికే అంచనా బడ్జెట్ 50% పెరిగింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'పుష్ప 2' ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa