ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కోటబొమ్మాళి పీఎస్' 2 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 27, 2023, 07:08 PM

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన 'కోటబొమ్మాళి పిఎస్' చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ ని అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన 2వ రోజు ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లు వసూళ్లు చేయగా 2 రోజుల్లో ఈ సినిమా టోటల్ గ్రాస్ 4.25 కోట్లకి చేరుకుంది.


సర్వైవల్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ కోట బొమ్మాళి PS సినిమా మలయాళ చిత్రం నయట్టు యొక్క రీమేక్. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, విష్ణు ఓయ్, దయానంద్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa