ప్రఖ్యాత భారతీయ క్రికెటర్ MS ధోని నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి LGM - లెట్స్ గెట్ మ్యారేజ్ అనే చిత్రాన్ని రూపొందించిన సంగతి అందరికి తెలిసిందే. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటించిన ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. కొన్ని వారాల క్రితం, ఈ చిత్రం తమిళ భాషలో మాత్రమే ప్రసారం చేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబటులో ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఇప్పుడు తెలుగు మరియు హిందీ భాషలలో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. నదియా, యోగి బాబు మరియు మిర్చి విజయ్ LGM లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ తమిళమణి సంగీత దర్శకుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa