బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ స్పై థ్రిల్లర్ టైగర్ 3 నవంబర్ 12న దీపావళి పండుగ ట్రీట్‌గా విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ని రాబట్టటంలో విఫలమైంది. తాజాగా ఇటీవలి ఇంటర్వ్యూలో, సల్మాన్ ఖాన్ తన మునుపటి చిత్రాలైన యాంటిమ్ మరియు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (KKBKJ) యొక్క పనితీరు తక్కువగా ఉండటానికి తక్కువ టిక్కెట్ ధరలే కారణమని పేర్కొన్నాడు.
సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, యాంటిమ్ మరియు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదలైనప్పుడు ప్రజలు థియేటర్లకు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. మేము అధిక ధరలకు వెళ్లలేదు. ప్రేక్షకుల డబ్బును ఆదా చేయడమే మా ఉద్దేశం. కాబట్టి మేము సాధారణ ధరలను ఎంచుకున్నాము. మేము తక్కువ సంపాదించి ఉండవచ్చు కానీ ప్రేక్షకులు సరసమైన ధరలలో సినిమాలను ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు KKBKJ విడుదల చేసి ఉంటే కలెక్షన్స్ పూర్తిగా భిన్నంగా ఉండేవి అని అన్నారు. ఇవి కుంటి సాకులు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
వర్క్ ఫ్రంట్ లో చూస్తే, సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం విష్ణువర్ధన్‌తో 'ది బుల్' అనే టైటిల్ తో రానుంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించనున్నారు.