నిర్మాత దిల్ రాజు ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు హీరో ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశకు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.అద్విత తండ్రి వ్యాపారవేత్త అని తెలుస్తోంది. వీరిద్దరి వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్ చేశారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఆశిష్ ‘రౌడీబాయ్స్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. విశాల్ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్ ఇవానా కథానాయికగా కనిపించనుంది.