ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప-2' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా వచ్చే వారం నుంచి ఓ పాట చిత్రీకరణను మేకర్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ జరుగుతోందని, ఆ తర్వాత పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 65 నుంచి 70 శాతానికి చేరుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.
అయితే షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి వెన్నునొప్పి ఎక్కువైందని సమాచారం. పుష్ప 2 షూటింగ్ డిసెంబర్ రెండో వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్ సీన్లో రిస్క్ చేయడం వల్లే అల్లు అర్జున్‌కి ఈ ఆరోగ్య సమస్య వచ్చిందని అంటున్నారు.