'వధువు’ వెబ్‌సిరీ్‌సలో ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని టీమ్ తెలిపింది. అవికాగోర్, నందు, అలీరెజా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సిరీస్ నేటి నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ‘వధువు’ విశేషాలను యూనిట్ మీడియాతో పంచుకుంది. నందు మాట్లాడుతూ ‘ఒకే కుటుంబంలో మనుషులు ఇంత భిన్నంగా ఎందుకున్నారు, వారి మధ్య జరిగే అనుమానాస్పద సంఘటనల వెనుకు ఎవరున్నారు అనేది ఆసక్తికరంగా ఉంటుంద’న్నారు. దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ ‘బెంగాలీ వెబ్‌సిరీస్ ‘ఇందు’ను ‘వధువు’గా రీమేక్ చేశాం. అవికా పెళ్లితో కథ మొదలవుతుంది. అవికా అత్తగారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం’ అన్నారు. ఈ సిరీ్‌సలో ప్రతి పాత్ర అనుమానించేలా ఉంటుందని నటి రూప చెప్పారు.