ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను రహస్యాలు అడగొద్దు

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2023, 04:50 PM

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే, ఆదిత్యరాయ్‌ కపూర్‌ , మధ్య ప్రేమ వ్యవహారం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ జంట తమ  ప్రేమ వ్యవహారాన్ని బయట చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీలో ఏ పార్టీ జరిగినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి పార్టీలోనూ వీళ్లిద్దరూ మెరిశారు. దీంతో ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8లో ఆదిత్యాను కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. తాజాగా ఈ ప్రోమోను విడుదల చేశారు. ‘అనన్యతో నువ్వు డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్‌ వస్తున్నాయి. నువ్వు చెబుతావోనని అందరూ ఆతురతగా ఎదురచూస్తున్నారు’’ అని కరణ్‌ అడిగారు. దీంతో ‘మీరు నన్ను రహస్యాలు అడగొద్దు.. నేను కచ్చితంగా అబద్థాలే చెబుతాను. దయచేసి మరో ప్రశ్న అడగండి’ అంటూ ఆదిత్య సరదాగా స్పందించారు. గత నెల జరిగిన ఎపిసోడ్‌లో అనన్యా పాల్గొని సందడి చేసింది. ఇక ఆదిత్య, అనన్య ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com