బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే (47) గుండెపోటుకు గురయ్యారు. సినిమా షూటింగ్లో ఉండగా గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గోల్మాల్ సిరీస్, గ్రాండ్ మస్తీ, ఓం శాంతి ఓం, కౌన్ ప్రవీణ్ తాంబే వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శ్రేయాస్ నటనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సినీ ఇండస్ట్రీలో మెప్పించాడు. పుష్ప హిందీ వెర్షన్లో అల్లు అర్జున్‌కి శ్రేయాస్ డబ్బింగ్ చెప్పారు.