ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికాసేపటిలో నైజాంలో మొదలు కానున్న 'సాలార్' సెలెబ్రేషన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 04:02 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్ర పోషించాడు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి నైజాంలో సాలార్ సినిమాని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, హైదరాబాద్‌లో సంధ్యా 70MM థియేటర్ లో ఈరోజు సాయంత్రం 4:59 నుండి కౌంటర్‌లో టిక్కెట్ సేల్స్ ఓపెన్ అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరి కొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa