ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తమ్ముడు' కోసం కాంతారా కంపోజర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 04:07 PM

టాలీవుడ్ నటుడు నితిన్ ఇటీవల వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఈ యంగ్ హీరో వేణు శ్రీరామ్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తమ్ముడు' అనే టైటిల్ ని లాక్ చేసారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చే అవకాశం ఉందని బలమైన బజ్. ఈ విషయం గురించి అతి త్వరలోనే మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో కథానాయిక, ఇతర కీలక నటీనటులను త్వరలో మూవీ మేకర్స్ ప్రకటిస్తారు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa